17-01-2012 జే.సి.ఎ సమ్మె వాయిదా
తేది. 15-12-2011 న కేంద్ర జే.సి.ఎ పోస్టల్ వుద్యోగుల నిరవధిక సమ్మె (17-01-2012)కు నోటీసు జారి చేసినది.
తేది.27-12-2011 న డిపార్ట్మెంట్ కు జే.సి.ఎ నాయకులకు మధ్య జరిగిన చర్చలు సఫలము కాలేదు. యిచ్చిన మినిట్స్కూడా అర్ధవంతముగా లేనట్లు తెలియజేయబడినది. తిరిగి 10-01-12 తేదిన జరిగిన చర్చలలో కూడా స్తంభనఏర్పడినట్లు సమాచారము.
తదుపరి 13-01-12 తేదిన జే.సి.ఎ నాయకుల తో జరిగిన చర్చలలో డి.జి పోస్ట్స్ మరియు యితర పోస్టల్ బోర్డ్ మెంబర్స్యిచ్చిన వ్రాత పూర్వక ఒప్పందము మేరకు మరియు కేంద్ర కమ్యుని కేషన్ల మంత్రి తో సమావేశమునకు అవకాశముకల్పించగలమని యిచ్చిన హామీ దృష్ట్యా సమ్మె విరమణకు జే.సి.ఎ అంగీకరించినట్లు తెలిసినది.
పూర్తి వివరాలు యింకా తెలియవలసియున్నది.
No comments:
Post a Comment